అది పచ్చ బ్యాచ్‌ పనే.. రేవ్‌ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్‌ Kakani Govardhan Reddy Slams Yellow Media Over Rave Party Stories | Sakshi
Sakshi News home page

అది పచ్చ బ్యాచ్‌ పనే.. రేవ్‌ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్‌

Published Mon, May 20 2024 1:09 PM | Last Updated on Mon, May 20 2024 3:32 PM

Kakani Govardhan Reddy Slams Yellow Media Over Rave Party Stories

బెంగళూరు రేవ్‌ పార్టీలో దుష్ప్రచారంపై ఏపీ మంత్రి కాకాణి స్పందన

ఆ కారుతో కానీ, కారు ఓనర్‌తో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు

ఎమ్మెల్యే స్టిక్కర్‌ జిరాక్స్‌ ఉందని నాపై బురద జల్లడం సరికాదు

ఇప్పటికే కర్నాటక పోలీసులకు ఫిర్యాదు చేశాం

సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ల అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్‌ పార్టీలో తన పేరు తెర మీదకు రావడం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారాయన. 

‘‘ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉందనే నెపంతో నాపై బురద జల్లడం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ల ప్రచారమే. వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించనున్నట్టు స్పష్టంగా వారికి అర్ధమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు. 

.. రేపవ్‌ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్‌తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్‌ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది.  అతనెవరో కూడా నాకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ జిరాక్స్‌ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్‌ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. 

రేవ్‌ పార్టీ వ్యవహారంపై బెంగుళూరు నార్కోటిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని మంత్రి కాకాణి మీడియాతో అన్నారు.

అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement