కేసీఆర్‌ను విమర్శించడమే కాంగ్రెస్, బీజేపీ పని Jagadish Reddy Shocking Comments On Congress Party And BJP | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను విమర్శించడమే కాంగ్రెస్, బీజేపీ పని

Published Sat, Jun 22 2024 4:10 AM | Last Updated on Sat, Jun 22 2024 4:10 AM

Jagadish Reddy Shocking Comments On Congress Party And BJP

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

బీఆర్‌ఎస్‌ ఒత్తిడి తర్వాతే సింగరేణి బ్లాకులపై వెనక్కి

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై విమర్శలతో ఎదురుదాడి చేయడం మినహా కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ సోయి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుందన్నారు. దీంతో తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ పారీ్టయేనని మరోమారు నిరూపితమైందన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేఆర్‌ఎంబీకి కృష్ణా జలాల అప్పగింత, గోదావరి, కావేరి అనుసం«ధానం సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ హక్కులను ఇతరులకు ధారాదత్తం చేస్తున్న ప్రతీ సందర్భంలో బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోందన్నారు.

సింగరేణి బ్లాకుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని డ్రామాలు ఆడుతున్నాయన్నారు. శ్రావణి బ్లాక్‌ వేలంపై డిప్యూటీ సీఎం భట్టి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం వద్ద నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సహా ఇతర బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు విడుదల చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్‌ అనేక అవకాశాలు ఇచ్చారన్నారు. కేసీఆర్‌కు దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, మీడియాలో కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, తెలంగాణ ముఖచిత్రం నుంచి ఆయనను అదృశ్యం చేయాలనుకుకోవడం కుదిరేపని కాదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement