‘ఓటమి భయంతోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించట్లేదు’ Farooq Abdullah Says Something fishy in not holding Assembly polls J&K | Sakshi
Sakshi News home page

‘ఓటమి భయంతోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించట్లేదు’

Published Sat, Mar 16 2024 7:44 PM | Last Updated on Sat, Mar 16 2024 8:18 PM

Farooq Abdullah Says Something fishy in not holding Assembly polls J&K - Sakshi

శ్రీనగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను ఈసీ విడుదల చేసింది. అయితే జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సైతం ఈసీ షెడ్యూల్‌ ప్రకటిస్తుందని కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ.. శనివారం ఈసీ నుంచి అటువంటి ప్రకటన వెలువడలేదు. లోక్‌సభ ఎన్నికల అనంతరం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎ‍న్‌సీ) అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా పలు అనుమానాలను వ్యక్తం చేశారు. లోక్‌ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవటంలో ఏదో తేడా కొడుతోందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించాలని చూస్తోందని.. ఇది దానికి ఒక అవకాశంలా కనిపిస్తోందన్నారు. 

జమ్ము కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు నిర్వమించగా లేని సమస్య అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తే ఏం జరుగుతుంది? అని ప్రశ్నించారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలను ఆశించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర గ్రీన్‌ సిగ్నర్‌ ఇవ్వకపోవటం బాధకరమన్నారు. ఎన్‌సీతో పాటు బీజేపీ నేతలు సైతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు నిర్వహిచాలని డిమాండ్‌ చేశాయని తెలిపారు. ఇదీ చాలా బాధకరం.. ఇంకా ఎన్ని రోజులు ఇలా రాష్ట్ర ప్రజలు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పరిపాలనలో ఉండాలని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ప్రజల హృదయాలు గెలుచుకోవాంటే ఇదే సరైన సమయం ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. 

నాలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్‌ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తూ.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రం తన సొంతం ప్రభుత్వం ఎన్నుకోకుండా ఎందుకు నిరాకరిస్తున్నారని నిలదీశారు. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర బీజేపీకి లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించపోవటానికి కారణం.. జమ్ము కశ్మీర్‌లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇక.. వారం రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం పూర్తిగా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఎన్‌సీ చీఫ్‌ ఫరూర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement