వరుస ఘటనలే నిదర్శనం.. కాంగ్రెస్‌, బీజేపీపై జగదీష్‌రెడ్డి విమర్శనాస్త్రాలు | Ex Minister Jagadish Reddy Comments On Congress And BJP, More Details Inside | Sakshi
Sakshi News home page

వరుస ఘటనలే నిదర్శనం.. కాంగ్రెస్‌, బీజేపీపై జగదీష్‌రెడ్డి విమర్శనాస్త్రాలు

Published Fri, Jun 21 2024 2:33 PM | Last Updated on Fri, Jun 21 2024 4:22 PM

Ex Minister Jagadish Reddy Comments On Congress And Bjp

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోందన్నారు.

తెలంగాణకు రక్షణ కవచం బీఆర్‌ఎస్ పార్టీ. ఏ సందర్బం వచ్చిన తెలంగాణ హక్కులను పరిరక్షించేది కేసీఆరే. తెలంగాణ హక్కుల్ని కాంగ్రెస్‌ ధారాదత్తం చేస్తోంది. వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. కేఆర్‌ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా ప్రవర్తించింది. కేసీఆర్‌పై ఎదురు దాడి చేసి తప్పించుకుందామనుకుంటుంది కాంగ్రెస్. సింగరేణి బొగ్గు గనుల విషయంలో కూడా ప్రత్యక్ష కార్యాచరణ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బొగ్గు గనుల వేలంపై రేవంత్ రెడ్డి మాట మార్చారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎదురు దాడి మొదలు పెట్టారు.’’ అంటూ జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్ ఉన్నప్పుడే సింగరేణి అమ్మారంటూ భట్టి విక్రమార్క చెప్తున్నారు. అబద్ధపు మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారు. దేనికో లొంగిపోయి బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసిపోయాయి. బహిరంగంగా ఫొటోలు దిగి పెడుతున్నారు కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వెనక కలిసి, ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు.’’ అని జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు.
 

సింగరేణికి ఉరి తాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement