కూటమిలో కత్తులు | Clash Between Tdp and Janasena Leaders Eluru District Polavaram Assembly Ticket | Sakshi
Sakshi News home page

కూటమిలో కత్తులు

Published Mon, Apr 8 2024 6:03 AM | Last Updated on Mon, Apr 8 2024 6:03 AM

Clash Between Tdp and Janasena Leaders Eluru District Polavaram Assembly Ticket - Sakshi

బాబు డీఎన్‌ఏ వెన్నుపోటును వంటబట్టించుకున్న నేతలు  

పోటీలో ఉన్న మిత్రపార్టీలకు వెనుక దెబ్బ  

సామాజిక న్యాయానికి పాతరేసిన పార్టీలు 

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఓసీలకే కేటాయింపు  

పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు  

ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం! 

తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయుల అల్టిమేటం   

పాలకొల్లు బాబు సభలో బన్నీవాసుకు అవమానం.. జనసైనికుల మండిపాటు  

గిద్దలూరులో రెబల్‌గా ఆమంచి స్వాములు 

సాక్షి  నెట్‌వర్క్‌ :  ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్‌ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్‌ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్‌ సామాజికవర్గాలదే.

దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్‌ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్‌ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్‌ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు.   

► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్‌ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్‌ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్‌ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.  గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్‌ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్‌ గౌడ్‌ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ నేత ప్రభాకర్‌ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు.   

► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్‌ వర్గీయులు కిరణ్‌తో సమావేశమయ్యారు. శంకర్‌కి టికెట్‌ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు.   

► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్‌చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్‌ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు.   

► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్‌రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్‌చార్జ్‌ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి ఆందోళన చేస్తున్నారు.   
►  కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్‌ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్‌ తేలి్చచెప్పారు.

కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. 
ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత  సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్‌ కళ్యాణ్‌ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు.  ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్‌ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు.   

సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్‌ సీపీ 
సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్‌ (కమ్మ), సెంట్రల్‌లో వెలంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య), విజయవాడ వెస్ట్‌లో  షేక్‌ ఆసిఫ్‌ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్‌ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్‌ జగన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.    

పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement