ఖానాపూర్ లో నువ్వా నేనా.. | - | Sakshi
Sakshi News home page

ఖానాపూర్ లో నువ్వా నేనా..

Published Mon, May 8 2023 1:02 AM | Last Updated on Mon, May 8 2023 1:28 PM

- - Sakshi

నిర్మల్‌: ఓ దిక్కు దట్టమైన అడవులు, ఎత్తయిన గుట్టలు, మరో దిక్కు గోదారి పరవళ్లు, కడెం, కవ్వా ల్‌ అందాలు.. ఎన్ని చీకట్లున్నా వీటన్నింటి మధ్యే బ తుకుతున్న అడవిబిడ్డలు.. ఇలా స్వచ్ఛమైన పచ్చని ప్రకృతి అందాలతో పెనవేసుకున్నట్లుంటుంది ఖా నాపూర్‌ నియోజకవర్గం. రాష్ట్రంలో స్వల్పంగా ఉన్న ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో ఇదొకటి. అందుకే ఇక్కడ నేతల మధ్య పోటాపోటీ. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు రానుండటంతో రోజురోజుకూ ఖానా పూర్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్‌ఎస్‌ ‘కారు’ ఓవర్‌ లోడ్‌ అవుతోంది. ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఉన్నా.. ఆమెకు ఈసారి టికెట్‌ రాదంటూ అదే పార్టీ నుంచి మరో నలుగురు ఇక్కడ సీటు ఆశిస్తున్నారు. ఎవరికి వారు ఈసారి తామే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘నేను లోకల్‌– నువ్వు నాన్‌లోకల్‌..’ అంటూ సవాల్‌ విసురుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం కంటే స్వపక్షంలో ఉన్నవాళ్లే ఒకరి పై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు.

ఎస్టీ రిజర్వుడ్‌ కావడంతో..
అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 2,05,751 మంది ఓటర్లు ఉండగా ఇందులో అధికశాతం గిరిజనులే. మండలాల వారీగా ఆదివాసీ, లంబాడాల ప్రాబల్యం ఉంటుంది. ఎన్నికల్లో నేతల గెలుపోటములను నిర్ణయించేది వీరే. రాష్ట్రంలో కేవలం తొమ్మిది ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఖానాపూర్‌తో పాటు ఆసిఫాబాద్‌, బోథ్‌ ఉన్నాయి. ఇందులో ఖానాపూర్‌ ప్రత్యేకం. ఈ నియోజకవర్గం మూడు జిల్లాలతో ముడిపడి ఉంది. ఖానాపూర్‌, కడెం, దస్తురాబాద్‌, పెంబి మండలాలు నిర్మల్‌లో, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలు ఆదిలాబాద్‌లో, జన్నారం మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి.

నాన్‌ లోకలే..
ఖానాపూర్‌ నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల సమయంలో ఎక్కువగా చర్చలకు వచ్చే విషయం లోకల్‌–నాన్‌లోకల్‌ గురించే. ఇక్కడ స్థానిక నేతలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వాళ్లూ వచ్చి పోటీ చేయడం ప్రత్యేకం. తాజాగా ఇదే అంశం స్థానికులైన నాయకులు లేవనెత్తుతున్నారు. ఇక్కడి ప్రజలకు నిస్వార్థంగా సేవచేసేది స్థానికులేనంటూ జనాల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్‌ సైతం జగిత్యాల జిల్లాకు చెందినవారు. ఈసారీ సీటుకోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో కూడా స్థానికేతర నేతలు ఉ న్నారు. ఇటీవల జోరుగా ప్రజల్లోకి వెళ్తున్న జాన్సన్‌నాయక్‌ది కూడా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి. ఉట్నూర్‌లో సెటిలైన ఆదిలాబాద్‌ జెడ్పీచైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ది ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం. ఇది ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోకి వస్తుంది. కొన్ని దఫాలుగా ఖానాపూర్‌ నియోజకవర్గంలో చాలామంది ఇతర ప్రాంతాలకు చెందిన నేతలే ఎక్కువగా పోటీలో ఉంటున్నారు. ఇందుకు ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గం కావడం, నియోజకర్గాలు తక్కువగా ఉండటమే కారణంగా చెబుతున్నారు.

నేనంటే నేనే..
ఖానాపూర్‌ నియోజకవర్గంలో ‘కారు’ స్పీడ్‌గానే దూసుకుపోతోంది. తొలిసారి 2004 ఎన్నికల్లో అజ్మీరా గోవింద్‌నాయక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గులాబీపార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్‌ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్‌ఎస్‌ గెలుపుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ఆశతో చాలామంది అభ్యర్థులు టికెట్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నలుగురు కూడా లంబాడ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్‌ రెండుసార్లు గెలిచిన తనకే మూడోసారి సీటు ఇస్తారని చెబుతున్నారు. సీఎం కూడా సిట్టింగ్‌లకే టికెట్‌ ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌ కలెక్టర్‌గా చేసిన శర్మన్‌ చౌహాన్‌ సైతం పార్టీ పెద్దలతో తనకున్న సంబంధా ల మేరకు తనకే టికెట్‌ ఖాయమంటున్నా రు. ఇప్పటికే నియోజకవర్గంలోని మా రుమూల గ్రామాల్లోకి సైతం వెళ్తూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

రాజ్యసభ ఎంపీ సంతోష్‌రావు ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ కన్వీనర్‌గా ఉన్న పూర్ణచందర్‌నాయక్‌ సైతం గ్రామగ్రామానికి వెళ్తున్నారు. ఎంపీ అండతో టికెట్‌ తనకే ఇస్తారన్న ప్రచారం ప్రజల్లో ఉంది.

ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న జాన్సన్‌నాయక్‌ ఎట్టి పరిస్థితుల్లో తానే అభ్యర్థినని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్‌కు దగ్గరి మిత్రుడని, ఆయనకే టికెట్‌ వస్తుందని తన అనుచరులు చెబుతున్నారు.

ఆదిలాబాద్‌ జెడ్పీచైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ సైతం తనకున్న సంబంధాల మేరకు టికెట్‌ తనకే ఇస్తారన్న నమ్మకాన్ని వెల్లడిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement