Mount Shatrunjaya: World's Only Mountain That More Than 900 Temples - Sakshi
Sakshi News home page

Mount Shatrunjaya: ఒక్క పర్వతంపై 900 ఆలయాలు.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..

Published Sat, Jul 15 2023 11:43 AM | Last Updated on Sat, Jul 15 2023 11:52 AM

mount shatrunjaya of gujrat has 900 temples - Sakshi

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక విషయాల్లో విభిన్నత కనిపిస్తుంది. జనం వివిధ నగరాల్లో కనిపించే వైవిధ్యానికి ఆకర్షితులవుతుంటారు. కొన్ని అంశాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిలో సముద్రాలు, పర్వతాలు, జలపాతాలు, నదులు మొదలైనవాటికి మనం ఎంతో ప్రాధాన్యతనిస్తుంటాం. అయితే వీటన్నింటి మధ్య ఒక పర్వతంపై ఏకంగా 900 ఆలయాలు ఉన్న విషయం మీకు తెలుసా?

ఈ పర్వతం భారతదేశంలోనే ఉంది. ఇది భక్తుల నమ్మకాలకు ప్రతీకగా నిలిచింది. దేశంలో అత్యధిక ఆలయాలు కలిగిన పర్వతం ఇదేకావడం విశేషం. ఈ అద్భుత పర్వతం ఎక్కడుంది? దీనివెనుకగల చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ మహాపర్వతంపేరు ‘శత్రుంజయ పర్వతం’. ఇది పాలీతానా శత్రుంజయ నది ఒడ్డున ఉంది. ఈ పర్వతంపై సుమారు 900 ఆలయాలు ఉన్నాయి. ఇన్ని ఆలయాలు ఉన్నకారణంగానే ఈ పర్వతం భక్తులకు ఆలవాలంగా మారింది. ప్రతీయేటా భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ అద్భుత పర్వతం మనేదేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. ఇది భావ్‌నగర్‌ జ్లిలాకు వెలుపలు భావ్‌నగర్‌ పట్టణానికి 50 ​కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఈ పర్వతంపై జైన తీర్థంకరుడు భగవాన్‌ రుషబ్‌దేవ్‌ ధ్యానం చేశాడని చెబుతారు. ఆయన ఇక్కడే తన తొలి ఉపదేశాన్ని ప్రవచించారట. ఈ పర్వతంపై గల ప్రధాన ఆలయం అత్యంత ఎత్తున ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 3 వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 24 తీర్థంకరులలోని 23 మంది తీర్థంకరులు ఈ  పర్వతాన్ని సందర్శించారు. ఈ కారణంగా ఈ పర్వతానికి ఇంత మహత్తు ఏర్పడిందంటారు.

పాలరాతి నిర్మాణాలు..
పర్వతంపై నిర్మితమైన ఆలయాలన్నీ పాలరాతితో నిర్మితమయ్యాయి. ఈ ఆలయాల నిర్మాణం 11వ శతాబ్ధంలో జరిగింది. ఈ ఆలయాలలో పలు కళాకృతులు కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడినంతనే ఈ ఆలయం శోభాయమానంగా వెలిగిపోతుంటుంది. అలాగే చంద్రుని వెలుగులోనూ ఆలయాలు తళుకులీనుతాయి. 

ఏకైక శాకాహార నగరంలో..
ప్రపంచంలోని ఏకైక శాకాహార నగరంగా గుర్తింపు పొందిన పాలీతానాలో ఈ పర్వతం ఉంది. ఈ నగరం శాకాహారులకు చెందినదిగా పేరు గడించింది. ఇక్కడివారెవరూ మాసం ముట్టరు. ఈ లక్షణమే ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.
ఇది కూడా చదవండి: గూగుల్‌ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement