మణిపూర్‌లో ఆయుధాల లూటీ Manipur violence: Mob loots weapons from police armoury after clashes with security forces | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో ఆయుధాల లూటీ

Published Sat, Aug 5 2023 5:55 AM | Last Updated on Sat, Aug 5 2023 5:55 AM

Manipur violence: Mob loots weapons from police armoury after clashes with security forces - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసు ఆయుధాగారంపై దుండగులు దాడి జరిపి ఆయుధాలను లూటీ చేశారు. ఎకే 47, ఘాతక్‌ వంటి అత్యాధునిక  రైఫిల్స్,  వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు. బిష్ణుపూర్‌ జిల్లా నారన్‌సైనా ప్రాంతంలో రెండవ ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌లో ఈ లూటీ జరిగింది. ‘‘బెటాలియన్‌ కేంద్రంపై దాడులకు దిగిన అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలను లూటీ చేశారు.

ఏకే, ఘాతక్‌ రైఫిళ్లు, 195 సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిల్స్, అయిదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్‌ గ్రేనేడ్స్‌ను              దొంగిలించారు’’ అని అధికారులు తెలిపారు. మరోవైపు మే 3వ తేదీన జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సామూహిక ఖననానికి ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకి దారి తీస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 25 మందికిపైగా గాయపడ్డారు.  దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement