Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు Man Drives Suv Through River To Overcome Traffic | Sakshi
Sakshi News home page

నదిలో పరుగులు పెట్టిన ఎస్‌యూవీ..కేసు పెట్టిన పోలీసులు

Published Tue, Dec 26 2023 11:10 AM | Last Updated on Tue, Dec 26 2023 11:20 AM

Man Drives Suv Through River To Overcome Traffic  - Sakshi

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్‌ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్‌యూవీ కార్‌ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్‌ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్‌యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్‌ వెహికిల్‌ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్‌ చౌదరి తెలిపారు. 

క్రిస్‌మస్‌, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్‌లతో పోలీసులు ట్రాఫిక్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.  

ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement