పెట్రోల్‌,డీజిల్‌ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే? | Karnataka Government Raises Petrol And Diesel Prices By Rs 3 Per Liter | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌,డీజిల్‌ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే?

Published Sat, Jun 15 2024 6:14 PM

Karnataka Government Raises Petrol And Diesel Prices

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్​ ఘన విజయానికి దోహదం చేసిన ఉచిత హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉచిత హామీలతో ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నిత్యవసర వస్తువల ధరల్ని పెంచుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పెంచింది. పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.20 పెంచుతూ నిర్ణయించింది.  దీంతో కర్ణాటకలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.85చేరగా.. డీజిల్‌ ధర రూ.88.93కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement