ఇద్దరూ టెకీలే: క్రికెటర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య గురించి తెలుసా? (ఫొటోలు) | USA Cricketer Saurabh Netravalkar Wife Devi Snigdha Muppala Photos Goes Viral | Sakshi
Sakshi News home page

ఇద్దరూ టెకీలే: క్రికెటర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)

Published Mon, Jun 17 2024 5:49 PM | Updated 30 Min Ago

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
1/9

టీ20 ప్రపంచకప్‌-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఒకడు.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
2/9

ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్‌ బౌలర్‌.. ఉన్నత విద్య ‍కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు. ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్‌‌ కెరీర్‌తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
3/9

ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
4/9

సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్‌ మాదిరే ఆమె కూడా కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
5/9

భర్తతో కలిసి ఒరాకిల్‌ సంస్థలో ప్రిన్సిపల్‌ అప్లికేషన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్‌ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్‌- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
6/9

32 ఏళ్ల సౌరభ్‌కు క్రికెట్‌ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్‌ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్‌ కథక్‌ డాన్సర్‌ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్‌ డాన్స్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్‌ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
7/9

స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
8/9

ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్‌- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్‌ చేస్తారు.

Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral
9/9

అదే విధంగా.. సౌరభ్‌ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్‌- ఫిట్‌నెస్‌ బ్లెండ్‌ ప్రోగ్రామ్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్‌ కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement