ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి Army Officer Dies After 8 Years In Coma Was Shot In Face By Terrorists | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి

Published Tue, Dec 26 2023 7:29 PM | Last Updated on Tue, Dec 26 2023 7:41 PM

Army Officer Dies After 8 Years In Coma Was Shot In Face By Terrorists - Sakshi

ఢిల్లీ: ఉగ్రదాడిలో గాయపడి ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ సింగ్ నట్ ప్రాణాలు కోల్పోయారు. టెరిటోరియల్ ఆర్మీ విభాగానికి చెందిన కరణ్‌బీర్‌ సింగ్ 2015లో చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాద కాల్పుల్లో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు. టెరిటోరియల్ విభాగాని కంటే ముందు ఆయన 160 ఇన్‌ఫెంట్రీ విభాగానికి సెకండ్ ఇన్ కమాండ్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన పద్నాలుగేళ్లు సైన్యంలో పనిచేశారు. 

2015 నవంబర్ 17న 41 రాష్ట్రీయ రైఫిల్స్ కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టింది. దీనికి నాయకత్వం వహించిన కల్నల్ సంతోష్ మహదిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కరణ్‌బీర్ సింగ్ తలకు తూటా గాయం అయింది. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఇన్నేళ్ల చికిత్స తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement