Tollywood Hero Kalyan Dev Cryptic Instagram Post Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Kalyan Dev Viral Post: 'ఆ ధైర్యం వచ్చినప్పుడే మన జీవితంలో సంతోషం': కల్యాణ్ దేవ్

Published Sun, Jul 2 2023 7:22 PM | Last Updated on Mon, Jul 3 2023 11:41 AM

Tollywood Hero Kalyan Dev Instagram Post Goes Viral - Sakshi

టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. విజేత సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజను.. కల్యాణ్‌ దేవ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే పాప కూడా ఉంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇటీవలే తన బిడ్డతో ఆడుకుంటున్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు కల్యాణ్. తాజాగా ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు. 

(ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!)

 తాజగా ఇన్‌స్టాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చారు. 'మన జీవితంలో మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే.. మనకు అత్యంత మధురక్షణాలు. దీనితో మీరు ఏకీభవిస్తారా?' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌ శ్రీజను ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచే సోషల్‌ మీడియాలో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఏడాదిన్నర కిందంటే ప్రచారం మొదలైంది. కానీ ఇంతవరకు దీనిపై అటు శ్రీజ, ఇటు కల్యాణ్‌ దేవ్‌ స్పందించనేలేదు. కాగా.. ఇటీవలే తన కూతురు నవిష్కతో కలిసి ఆడుకున్న ఫోటోలు షేర్‌ చేసిన కల్యాణ్‌.. 'వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే' పోస్ట్ చేశారు.

(ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement