కల్కి మూవీపై రాజమౌళి రివ్యూ.. ఆయన ఏమన్నారంటే? Tollywood Director Review On Prabhas Kalki 2898 AD Movie | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Movie: 'చివరి 30 నిమిషాలు'.. కల్కి మూవీపై రాజమౌళి రివ్యూ..!

Published Thu, Jun 27 2024 3:14 PM | Last Updated on Thu, Jun 27 2024 3:23 PM

Tollywood Director Review On Prabhas Kalki 2898 AD Movie

ప్రభాస్-నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజైంది. ఉదయాన్నే బెనిఫిట్ షో నుంచే ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి షో నుంచే కల్కికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే తొలి రోజే సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి తన రివ్యూను ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

రాజమౌళి తన ట్వీట్‌లో రాస్తూ..' కల్కి మూవీ ప్రపంచం నిర్మాణాన్ని ఇష్టపడ్డా. అద్భుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. డార్లింగ్ తన టైమింగ్, టాలెంట్‌తో చంపేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపిక నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది. అయితే సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తమ ప్లాన్‌ను అమలు చేయడంలో వందశాతం ప్రయత్నం సక్సెస్‌ సాధించారు.  నాగి, అలాగే మొత్తం వైజయంతి టీమ్‌కు అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement