మెగాస్టార్‌ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్‌! Star Actress Will Acts In Megastar Chiranjeevi New movie | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi : మెగాస్టార్‌ విశ్వంభర.. ఆ కాంబో రిపీట్‌ కానుందా!!

Published Wed, May 15 2024 6:40 PM | Last Updated on Wed, May 15 2024 8:18 PM

Star Actress Will Acts In Megastar Chiranjeevi New movie

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపంచనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్‌ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.

విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ నచ్చడంతో  ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. మరోవైపు ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్​తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్​లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది.  ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement