స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత! Sonali Bendre Recollect Incident Happened With Bhopal Fan | Sakshi
Sakshi News home page

Sonali Bendre: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. సోనాలి అసహనం!

Published Mon, Jun 17 2024 2:08 PM

Sonali Bendre Recollect Incident Happened With Bhopal Fan

హీరోహీరోయిన్లకు అభిమానులు చాలా మంది ఉంటారు. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తెలుగులో చాలామంది స్టార్ హీరోలకు ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లు చేసే అతి మామూలుగా ఉండదు. రీసెంట్‌గా అలాంటి ఓ వీరాభిమాని, తన అభిమాన హీరో దర్శన్ చేతిలో హత్యకు గురయ్యాడు. దీని గురించి అలా వదిలేస్తే.. హీరోయిన్ సోనాలి బిం‍ద్రే కోసం ఓ అభిమాని ఏకంగా చెరువులు దూకి చనిపోయాడు. అప్పుడెప్పుడో జరిగిన ఈ సంఘటన తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది.

1999,2000ల కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా స్టార్‌డమ్ అనుభవించిన సోనాలి బింద్రే.. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి.. దాన్నుంచి బయటపడింది కూడా. ఇప్పటికీ అడపాదడపా యాక్టింగ్ చేస్తున్న సోనాలి బింద్రే.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోలో పాల్గొంది. తన గురించిన ఒకప్పటి విషయాల్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో)

అప్పట్లో షూటింగ్‌ కోసమని సోనాలి.. భోపాల్ వెళ్లింది. అయితే ఈమెని చూసేందుకు ఓ అభిమాని చెరువులో దిగి మృత్యువాత పడ్డాడు. దీని గురించి ఏమైనా తెలుసా? అని సోనాలిని యాంకర్ అడగ్గా.. 'ఆ సంఘటనని నిజంగా నమ్మలేకపోతున్నాను. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పటికీ ఆ సంఘటన గురించి తెలిదు. ఇంతకీ నిజంగానే అలా జరిగిందా? అసలు అభిమాన హీరోయిన్ చూడటం కోసం ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమైన విషయం. నమ్మలేకపోతున్నా' అని విచారం వ్యక్తం చేసింది.

'అప్పట్లో మెయిల్స్, ఉత్తరాలు నాకు చాలా వచ్చేవి. కొందరు రక్తంతో ఉత్తరాలు రాసేవారు. అది నిజంగా వాళ్ల రక్తమేనా? అది రక్తమేనా అనే సందేహం వచ్చేసింది. ఎందుకు మనుష్యులు.. తమలాంటి మరో మనిషి కోసం ఇంతలా తాపత్రయపడతారో అర్థమయ్యే కాదు. బాలీవుడ్‌లోని ఫ్యాన్ కల్చర్, హీరోహీరోయిన్ పట్ల అతిప్రేమ నాకు అస్సలు ఇష్టముండదు' అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement