హీరోయిన్‌ శోభితతో నాగచైతన్య వెకేషన్‌.. బార్‌లో.. Sobhita Dhulipala, Naga Chaitanya Pic from Wine Tasting Session in Europe | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: హీరోయిన్‌తో టూర్‌ చెక్కేసిన చైతూ.. మళ్లీ దొరికిపోయారుగా!

Published Tue, Jun 4 2024 4:59 PM | Last Updated on Tue, Jun 4 2024 5:01 PM

Sobhita Dhulipala, Naga Chaitanya Pic from Wine Tasting Session in Europe

హీరో నాగచైతన్య, హీరోయిన్‌ శోభిత ధూళిపాళ లవ్‌లో ఉన్నారని చాలాకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికితోడు వీరిద్దరూ జంటగా పలుమార్లు వెకేషన్‌కు వెళ్లారు. ఒకే లొకేషన్‌లో విడివిడిగా ఉన్న ఫోటోలను షేర్‌ చేసేవారు. ఫోటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి వీరు కలిసే ట్రిప్పుకు వెళ్లారని అభిమానులు ఇట్టే పసిగట్టేవారు.

తాజాగా ఈ జంట మరోసారి వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూరప్‌లోని ఓ బార్‌లో వైన్‌ టెస్టింగ్‌ సెషన్‌లో చై, శోభిత పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. 'వీళ్లు ఎప్పటినుంచో కలిసే తిరుగుతున్నారు. ఇప్పటికీ ట్రిప్పులకు జంటగానే వెళ్తున్నారు', 'యూరప్‌లో ఈ సమయంలో వైన్‌ తాగితే భలే ఉంటుంది..', 'చై, శోభిత మంచి ఫ్రెండ్స్‌ అనుకుంటా..' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా చై ప్రస్తుతం తండేల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. శోభిత విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె సితార అనే సినిమా చేస్తోంది.

 

Naga Chaitanya and Sobhita spotted in Europe at a wine tasting few days ago 🍷👀
byu/Eternal-Wisdom-9999 inBollyBlindsNGossip

 

చదవండి: భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్‌, ఫలించని పూజలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement