'సీతా కళ్యాణ వైభోగమే' చిత్ర యూనిట్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి | Seetha Kalyana Vaibhogame Movie Team With Telangana CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

'సీతా కళ్యాణ వైభోగమే' చిత్ర యూనిట్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

Published Mon, Jun 17 2024 7:11 PM

Seetha Kalyana Vaibhogame Movie Team With CM Revanth Reddy

రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలే కాకుండా మన నేటివిటీని, మన ఆచార సంప్రదాయాల్ని చూపించే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా రావడం లేదు. కానీ మన ఆచార, సంప్రదాయాలు, మన సంస్కృతిని చాటేలా, మన ఇతిహాసగాథలైన రామాయణం నుంచి ప్రేరణపొంది ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమాను సతీష్ పరమవేద తెరకెక్కించారు.

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ వద్దకు చిత్రయూనిట్ వెళ్లింది.

సీఎం రేవంత్ రెడ్డికి చిత్ర టీజర్, ట్రైలర్‌ను చూపించారు. సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్‌ను వీక్షించిన ముఖ్యమంత్రి చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా నిర్మాతను అభినందించారు. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయని సినిమా పెద్ద హిట్ అవ్వాలని, యూనిట్‌కు మంచి పేరు రావాలని ఆయన అన్నారు అన్నారు. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నిర్మాత రాచాల యుగంధర్, డైరెక్టర్ సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి కెమెరామెన్ పరశురామ్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement