సూసేకి.. అ‍గ్గిరవ్వమాదిరి.. హన్సిక డ్యాన్స్‌ అదిరిపోయింది! | Pushpa 2: Hansika Motwani Dance for Sooseki Song, Video Goes Viral | Sakshi
Sakshi News home page

సూసేకి.. అ‍గ్గిరవ్వమాదిరి.. హన్సిక డ్యాన్స్‌ అదిరిపోయింది!

Published Sun, Jun 16 2024 2:42 PM

Pushpa 2: Hansika Motwani Dance for Sooseki Song, Video Goes Viral

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత హిట్‌ అయ్యిందో, అందులోని పాటలు అంతకుమించి హిట్‌ అయ్యాయి. సమంత నటించిన ఊ అంటావా మామా అనే ఐటమ్‌ సాంగ్‌ కుర్రకారును గిలిగింతలు పెట్టించింది. దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయి సినిమాకే ఎంతో హైప్‌ తెచ్చి పెట్టింది. 

పలువురు సినీస్టార్స్‌తో పాటు, ఇతరులు కూడా ఈ పాటకు డ్యాన్స్‌ చేసి ఆ వీడియోలను వైరల్‌ చేశారు. అదేవిధంగా రష్మిక మందన్నా నటించిన రా రా సామి అనే పాట కూడా బాగా వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం పుష్ప–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాట సినిమా హైప్‌ను పెంచేస్తోంది.

ఈ పాటకు హన్సిక లంగా ఓణి ధరించి నలుగురు కుర్రాళ్లతో కలిసి చేసిన డాన్స్‌ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రానికి చిత్ర యూనిట్‌ ఇంకా పబ్లిసిటీని ప్రారంభించలేదు. అయితే హన్సిక వంటి సెలబ్రిటీలు అందులోని పాటకు డాన్స్‌ చేయడంతో ఇప్పటి నుంచే ఫ్రీ పబ్లిసిటీ మొదలైందన్నమాట. మరోవైపు సూసేకి సాంగ్‌.. తెలుగు, హిందీ వర్షన్స్‌ కలుపుకుని యూట్యూబ్‌లో 100 మిలియన్‌ (పది కోట్ల) వ్యూస్‌ రాబట్టడం విశేషం.

 

 

చదవండి: ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement