‘పురుషోత్తముడు’ మారిన రాజ్‌ తరుణ్‌..డబ్బింగ్ పనుల్లో బిజీ Purushottamudu Movie Gets Busy In Dubbing Works | Sakshi
Sakshi News home page

రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’.. డబ్బింగ్ పనుల్లో బిజీ

Published Wed, Jan 24 2024 8:32 PM | Last Updated on Thu, Jan 25 2024 9:49 AM

Purushottamudu Gets Busy In Dubbing Works - Sakshi

రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు'. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్‌ పనుల్లో బిజీగా ఉంది.   రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు.

నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement