ఫైనల్లీ 'కల్కి' సాంగ్ వచ్చేసింది.. అదే కాస్త డిసప్పాయింట్! | Prabhas Kalki 2898 AD Anthem Song Release And Analysis | Sakshi
Sakshi News home page

Prabhas Kalki Song: వాయిదాల తర్వాత రిలీజైన 'కల్కి' పాట

Published Mon, Jun 17 2024 2:25 PM

Prabhas Kalki 2898 AD Anthem Song Release And Analysis

మరో పది రోజుల్లో ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD' థియేటర్లలోకి రాబోతుంది. కానీ ఇప్పటికే ప్రమోషన్స్ ఊసే లేదు. ఈ క్రమంలోనే భైరవ ఏంథమ్ సాంగ్ వచ్చేస్తుంది అంటూ గత మూడు రోజుల నుంచి ఉదరగొట్టారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తాజాగా దీన్ని రిలీజ్ చేశారు. మరి ఇది ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)

ఆదివారం సాయంత్రం 8 గంటలకు 'భైరవ ఏంథమ్' సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఏమైందో ఏమో సోమవారం ఉదయం 11 గంటలకు అన్నారు. ఇక్కడ కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో తెలుగు లిరిక్స్‌తో పాటు హిందీ లిరిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. దీంతో వింటున్నది తెలుగు పాట? హిందీ లేదా పంజాబీ పాట అనేది అర్థం కాలేదు.

అయితే ఈ ప్రమోషనల్ సాంగ్.. తెలుగు ప్రేక్షకుల కోసం కాకుండా ఉత్తరాది ఆడియెన్స్‌ని ఎట్రాక్ట్ చేయడం కోసమే రూపొందించినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పాటలో కనిపించిన ప్రభాస్ మనకు తెలుసు. కానీ దిల్జీత్ దోసాంజే మాత్రం మనలో చాలామందికి తెలియదు. మరి ఈ పాట ఎంతలా కనెక్ట్ అవుతుందనేది ఒకటి రెండు రోజులు ఆగితే తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్ మామూలోడు కాదు.. రెమ్యునరేషన్ వింత కండీషన్స్!)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement