కొంతకాలం గడిచింది... చివరికి..! Nivetha Thomas To Get Married Soon: Post Goes Viral | Sakshi
Sakshi News home page

కొంతకాలం గడిచింది... చివరికి..!

Published Tue, Jun 25 2024 12:05 AM | Last Updated on Tue, Jun 25 2024 11:25 AM

Nivetha Thomas To Get Married Soon: Post Goes Viral

దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలయాళ బ్యూటీ నివేదా థామస్‌. నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మన్‌’ (2016) మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘నిన్ను కోరి, జై లవ కుశ, బ్రోచేవారెవరురా, వకీల్‌ సాబ్‌’ వంటి పలు సినిమాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘డాకిని శాకిని’ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు నివేద. అయితే తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

‘చాలా కాలమైంది.. బట్‌.. చివరికి.. ’ అంటూ లవ్‌ ఎమోజీని జత చేసి సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు నివేద. లవ్‌ సింబల్‌ పెట్టారు కాబట్టి ఇది ప్రేమకు సంబంధించిన వార్త అని, నివేద ఎంగేజ్‌మెంట్‌ అయిందని, తన పెళ్లి కబురు గురించే ఆ పోస్టు పెట్టారని నెటిజన్లు, ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొందరేమో తన కొత్త సినిమా ప్రకటన గురించి అయి ఉంటుందని ఊహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం కొత్త సినిమాలేవీ లేకపోవడంతో నివేద పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారనే వారూ లేకపోలేదు. మరి ఆమె పోస్ట్‌కి అర్థం ఏంటి? అనేది నివేదానే చెబితేనే తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement