క్యూట్‌ ఈగోస్‌ ఉండే ఫన్‌ ఫిలిం ‘విద్య వాసుల అహం’. Mallu Kanth Gelli Talk About Vidya Vasula Aham Movie At Trailer Release Event | Sakshi
Sakshi News home page

క్యూట్‌ ఈగోస్‌ ఉండే ఫన్‌ ఫిలిం ‘విద్య వాసుల అహం’.

Published Thu, May 16 2024 11:14 AM | Last Updated on Thu, May 16 2024 11:14 AM

Mallu Kanth Gelli  Talk About Vidya Vasula Aham Movie At Trailer Release Event

రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ జంటగా మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. మహేష్‌ దత్తా, లక్ష్మి నవ్య నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో మణికాంత్‌ గెల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘విద్య వాసుల అహం’ రూపొందింది. వెంకీ అద్భుతమైన కథ రాయడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను’’ అన్నారు. 

రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక చిన్న క్యూట్‌ ఈగోస్‌ (అహం) ఉండే ఫన్‌ ఫిలిం’’ అన్నారు. ‘‘రాహుల్‌ మంచి రైటర్‌ కూడా. ఈ స్క్రిప్ట్‌ని తను ఒప్పుకున్నాడంటే కథ బాగుంటుందని అనిపించి నేను కూడా ఓకే చేశాను’’ అన్నారు శివానీ రాజశేఖర్‌.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement