మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్ Britney Spears Gets Officially Divorced After 14 Months Of Marriage | Sakshi
Sakshi News home page

మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్

Published Sun, May 5 2024 10:25 AM | Last Updated on Sun, May 5 2024 12:35 PM

Britney Spears Gets Officially Divorced After 14 Months Of Marriage

ప్రముఖ హాలీవుడ్ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్ విడాకులు తీసుకుంది. తన భర్త సామ్ అస్గారితో అధికారికంగా విడిపోయింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతేడాది జూలైలో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట .. ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే పెళ్లికి ముందే దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు.

కాగా.. బ్రిట్నీ స్పియర్స్‌కి ఇది మూడో వివాహం కాగా.. ఆమె రెండో భర్త కెవిన్ ఫెడెర్‌లైన్‌తో ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. వీరిద్దరు 2004 నుంచి 2007 వరకు కలిసి ఉన్నారు.  ఆ తర్వాత విడిపోయారు. బ్రిట్నీ స్పియర్స్ మొదట చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే విడిపోయింది. ఆ తర్వాత 2016లో నటుడు అస్గారితో డేటింగ్ చేయడం ప్రారంభించింది. 2021 సెప్టెంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement