అనుపమ పరదా | Anupama Parameswaran upcoming Telugu film Titled Parada | Sakshi
Sakshi News home page

అనుపమ పరదా

Published Sat, Apr 27 2024 1:28 AM | Last Updated on Sat, Apr 27 2024 1:28 AM

Anupama Parameswaran upcoming Telugu film Titled Parada

అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘పరదా’ అనే టైటిల్‌ ఖరారైంది. ‘సినిమా బండి’ ఫేమ్‌  ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్, కాన్సెప్ట్‌ వీడియోను నటి సమంత, దర్శక–నిర్మాతలు రాజ్‌ అండ్‌ డీకే షేర్‌ చేశారు. ‘పరదా’ కాన్సెప్ట్‌ వీడియోలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే శ్లోకం వినిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది.

ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌ లొకేషన్స్‌తో పాటు ఆ పరిసర గ్రామాల్లో ఇప్పటివరకు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘‘మేలో హైదరాబాద్‌లో జరగనున్న కొత్త షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు ప్రవీణ్‌. ‘‘ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణమే మా చిత్రం’’ అన్నారు విజయ్‌ డొంకాడ. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement