Allu Aravind Dance With Anupama Parameswaran At 18 Pages Success Party - Sakshi
Sakshi News home page

Allu Aravind- Anupama : అనుపమతో స్టెప్పులేసిన అల్లు అరవింద్‌.. వీడియో వైరల్‌

Published Sun, Dec 25 2022 1:21 PM | Last Updated on Sun, Dec 25 2022 2:25 PM

Allu Aravind Dances With Anupama Parameswaran At 18 Pages Sucess Party - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ మరో సూపర్‌హిట్‌ మూవీని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదివరకే కార్తికేయతో సక్సెస్‌ అందుకున్న ఈ జోడీ తాజాగా 18 పేజెస్‌తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా అనుపమ, నిఖిల్‌ల నటన, డైలాగ్స్‌ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. డిసెంబర్‌ 23న విడుదలైన 18 పేజెస్‌ సినిమా తొలిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తూ క్లాసిక్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది.

ఇందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ మూవీలోని 'టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు' అంటూ సాగే పాటకు అనుపమతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. అనుపమ, అల్లు అరవింద్‌తో పాటుగా, సుకుమార్ కూడా స్టెప్పులు వేశారు. ఈ వీడియోను నిఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement