ఇద్దరు బాలికలకు పాముకాటు.. | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాలికలకు పాముకాటు..

Published Wed, Jun 26 2024 1:00 AM | Last Updated on Wed, Jun 26 2024 10:16 AM

-

ఒకరి మృతి.. మరొకరు ఆస్పత్రిలో చేరిక

ఖిల్లా ఆస్పత్రిలో మందులు, అంబులెన్స్‌ లేక ఇబ్బందులు

చికిత్స కోసం ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లిన కుటుంబసభ్యులు

కొత్తపల్లి తండా, ఊరంచు తండాలో చోటుచేసుకున్న ఘటన

మహబూబ్‌నగర్‌: వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలను పాముకాటు వేయగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరొకరిని చికిత్స నిమిత్తం ఖిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్య సిబ్బంది పాముకాటు మందులు, అంబులెన్స్‌ లేవు అని చెప్పడంతో చావుబతుకుల మధ్య బాలికను ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్‌కు తరలించారు.

ఈ ఘటనలు వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం కొత్తపల్లి తండా, ఊరంచు తండాలో మంగళవారం చోటుచేసుకున్నాయి. ఆయా కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన ముడావత్‌ రవినాయక్‌ కుటుంబ సభ్యులతో కలిసి రోజులానే ఇంట్లో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కూతురు ఇందు (10)ను ఓ పాము కాటు వేసింది.

వెంటనే నిద్రలేచిన ఇందు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇళ్లంతా వెతకగా కట్లపాము కనిపించింది. దానిని చంపి పాపను చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. తండ్రి రవినాయక్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

షాపురం ఊరంచు తండాలో..
ఇదిలాఉండగా, మండలంలోని షాపురం ఊరంచు తండాకు చెందిన రెడ్యానాయక్‌ కూతురు లలిత తిమ్మాజిపేట గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల తండాకు వచ్చిన లలిత మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లింది. పొలంలో నడుస్తున్న క్రమంలో ఓ పాము బాలిక లలితను కాటువేసింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా.. కాట్లు గుర్తించి చికిత్స నిమిత్తం ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement