హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు | US forces air strikes on Houthi underground weapons storage facilities - Sakshi
Sakshi News home page

హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు

Published Sat, Mar 23 2024 1:01 PM | Last Updated on Sat, Mar 23 2024 1:37 PM

Us Strikes On Houthi Millitants Underground Wepon Fecilities - Sakshi

వాషింగ్టన్‌ : హౌతీ గ్రూపు మిలిటెంట్లు తమ ఆయుధాలు దాచుకున్న యెమెన్‌లోని‍ వారి భూగర్భ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌( సెంట్‌కామ్‌) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో హౌతీలకు చెందిన నాలుగు అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్స్‌  (యూఏవీ)లను ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది.

దాడుల సమయంలో హౌతీలు ఎర్ర సముద్రంలోకి నాలుగు యాంటీ షిప్‌ బాలిస్టిక్‌ మిసైళ్లను ప్రయోగించినట్లు సెంట్‌కామ్‌ వెల్లడించింది. హౌతీల దాడుల్లో నౌకలకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను నివారించేందుకే వారి ఆయుధ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.

కాగా, ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు గత కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి యూరప్‌, అమెరికా వెళ్లే నౌకలు దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతర్జాతీయ నౌకాయాన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. 

ఇదీ చదవండి.. గాజాలో కాల్పుల విరమణ.. యూఎన్‌లో వీగిన అమెరికా తీర్మానం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement