జపాన్‌ను తాకిన సునామీ | Tsunami Hits Japan 2024 Updates - Sakshi
Sakshi News home page

జపాన్‌ను తాకిన సునామీ.. ఐదు మీటర్ల ఎత్తులో అలలు!!

Published Mon, Jan 1 2024 5:03 PM | Last Updated on Mon, Jan 1 2024 6:15 PM

Tsunami Hits Japan 2023 Updates - Sakshi

కొత్త సంవత్సరం తొలిరోజే.. తూర్పు ఆసియా ద్వీప దేశం జపాన్‌ భారీ భూ కంపం, సునామీతో వణికిపోయింది. సోమవారం కేవలం గంటన్నర వ్యవధిలోనే 21సార్లు భూమి కంపించింది అక్కడ. సునామీ ధాటికి అలలు ఎగిసి పడడంతో.. తీర ప్రాంత ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపలు వచ్చే అవకాశం.. సునామీ ముప్పు ఇంకా తొలగిపోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

మరోవైపు సునామీ తీర ప్రాంతాలన్నింటికి తాకవచ్చని అక్కడి ప్రభుత్వం టీవీ ఛానెల్స్‌ ద్వారా హెచ్చరించింది. ఇషికావాలో ఐదు మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడొచ్చని అంచనా వేసింది. అంతకు ముందు.. తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అలలు ఎగసిపడే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పరుగులు తీయాలని ప్రజలకు సూచించింది. మరోవైపు భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, న్నిగాటాలో దాదాపు 35 వేల నివాసాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


 
భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.6గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.


ఉత్తర కొరియా, రష్యా కూడా..  

ఈ భారీ భూకంపంతో జపాన్‌తో పాటు ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్‌కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు. ఇంకోవైపు రెండు మీటర్ల ఎత్తునన అలలు ఎగసి పడే అవకాశం ఉండడంతో ఉత్తర కొరియా తన రేడియో ఛానెల్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

భారత్‌ ఎమర్జెన్సీ నెంబర్లు
జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది. సహాయం కోసం ఆయా నెంబర్లను సంప్రదించాలని సూచించింది. 

రేడియో ఆక్టివిటీ ఛాయల్లేవ్‌
సునామీ ఆందోళన నేపథ్యంలో.. అక్కడి న్యూక్లియర్‌ రియాక్టర్‌ కేంద్రాల నుంచి అణుధార్మికత విడుదలై ఉంటుందా? అనే ఆందోళన వ్యక్తం అయ్యింది.  అయితే ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే.. ఇంకా భూకంప భయం వీడకపోవడంతో ఏదైనా జరగవచ్చే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement