నెతన్యాహు సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్‌ వార్‌ క్యాబినెట్‌ రద్దు | Israel's Netanyahu Dissolves War Cabinet | Sakshi
Sakshi News home page

తప్పుకున్న ప్రతిపక్ష నేతలు.. ఇజ్రాయెల్‌ వార్‌ క్యాబినెట్‌ రద్దు

Published Mon, Jun 17 2024 6:57 PM

Israel Dissolves War Cabinet

జెరూసలెం: హమాస్‌ లక్ష్యంగా గాజాపై గత కొంత కాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్‌ క్యాబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వార్‌ క్యాబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్‌, గాడీ ఐసెన్‌కోట్‌ వార్‌ క్యాబినెట్‌ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన నేపథ్యంలో దానిని రద్దు చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌ మెరుపుదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 

దీంతో ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులకు దిగింది. హమాస్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్‌ క్యాబినెట్‌ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement