Watch: బైడెన్‌ Vs ట్రంప్‌ వాడీవేడీ మాటల దాడి.. First Presidential Debate Between Donald Trump And Joe Biden Live Updates | Sakshi
Sakshi News home page

Watch: బైడెన్‌ Vs ట్రంప్‌ వాడీవేడీ చర్చ లైవ్‌ అప్‌డేట్స్‌

Published Fri, Jun 28 2024 7:31 AM | Last Updated on Fri, Jun 28 2024 8:59 AM

First Presidential Debate Between Donald Trump And Joe Biden Live Updates

Live Updates..

👉బైడెన్‌, ట్రంప్‌ మధ్య ముగిసిన డిబెట్‌.. 

 

👉డిబెట్‌లో భాగంగా సహనం కోల్పోయిన బైడెన్‌.. ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు

 

 


👉గత ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా?

👉ట్రంప్‌ సమాధానిమిస్తూ.. ఇది న్యాయమైన, చట్టబద్ధమైన ఎన్నికలు అయితే ఖచ్చితంగా అంగీకరిస్తాను. కానీ ఈ ఎన్నికలు మోసం, హాస్యాస్పదంగా జరిగాయి.

👉బైడెన్‌ స్పందిస్తూ.. ట్రంప్‌ నువ్వు ఓడిపోయావు. అనంతరం, దేశవ్యాప్తంగా కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారు. మీ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే ఏ న్యాయస్థానాలు గుర్తించలేదు. మోసం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మళ్లీ ఓడిపోతే దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోవడం లేదు. 

 

👉ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం, పాలస్తీనా స్వతంత్ర దేశానికి మద్దతు ఇ‍స్తారా? అన్న ప్రశ్నపై ట్రంప్‌ స్పందిస్తూ.. దానిపై ఆలోచిస్తాం అని చెప్పుకొచ్చారు.
బైడెన్‌ బలహీనుడు. అతను ఇప్పుడు పాలస్తీనియన్‌ వ్యక్తిగా మారిపోయాడు. అయినప్పటికీ బైడెన్‌ను వారు ఇష్టపడటం లేదు. 

 

 

👉అమెరికాలో చరిత్రలో బైడెన్‌ వంటి అసమర్థ నాయకుడిని ఎన్నడూ చూడలేదు: ట్రంప్‌  

 

 

👉డిబెట్‌ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరూ నేతలు మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దుల గురించి, బైడెన్‌ తీసుకువచ్చిన పలు చట్టాలపై మాటల దాడి జరిగింది.

 

👉బైడెన్‌పై విరుచుకుపడిన ట్రంప్‌.. 

బైడెన్‌ కొడుకు విషయంలో ట్రంప్‌ మాటల దాడి చేశారు. గన్స్‌, డ్రగ్స్‌ విషయంలో బైడెన్‌ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నలు చేశారు. అతడిని అరెస్ట్‌ కాకుండా కాపాడుకున్నారు. 

 

 

👉 ఉక్రెయిన్ అంశంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 
ఉక్రెయిన్‌ అంశాన్ని ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారు. 

 

👉సరిహద్దుల విషయంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నష్టపోయిందని బైడెన్‌ ఫైరయ్యారు. 

 

👉 చర్చ సందర్భంగా ఇరువురూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్‌ లూసర్‌ అంటూ బైడెన్‌ అన్నారు. 
 

 

👉ఆప్ఘనిస్థాన్‌ విషయంలో బైడెన్‌ తీసుకున్న చర్యల కారణంగా 13 మంది అమెరికా భద్రతా సిబ్బంది అమరులయ్యారని ట్రంప్‌ ఆరోపించారు. అమెరిక్లను కాపాడటంలో బైడెన్‌ దారుణంగా విఫలమయ్యారు.  

 

 

 

 👉 ట్రంప్‌నకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనన్న జో బైడెన్‌. ట్రంప్‌ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు. 

 

 

👉ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చ మొదలైంది.

👉ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ఫ్రీఫాల్‌లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15%కి పెరిగింది, ఇది భయంకరమైనది అన్నారు.

 

👉దీనికి ప్రతిగా ట్రంప్‌ మాట్లాడుతూ..  చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్‌ ప్రభుత్వంపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్‌ పరిపాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమవలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్భణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. 
 

👉చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్‌ ప్రభుత్వంపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారని ఆరోపించారు. 
 

👉అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు జో  బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య వాడీవేడి చర్చా కార్యక్రమం జరుగుతోంది. ఇరువురు నేతలు ముఖాముఖి డిబెట్‌లో పాల్గొన్నారు.

👉అమెరికా చర్రితలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement