ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట! Billionaire Warren Buffett wife overheard complaining about Rs 300 coffee | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట!

Published Mon, Jul 17 2023 6:37 AM | Last Updated on Mon, Jul 17 2023 6:37 AM

Billionaire Warren Buffett wife overheard complaining about Rs 300 coffee - Sakshi

ఇడహొ: ప్రపంచ కుబేరుల్లో వారెన్‌ బఫెట్‌ ఒకరు. ఆయన ఆస్తి 115 బిలియన్‌ డాలర్లకు పైమాటే. అటువంటి వ్యక్తి భార్య కాఫీ ధర ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. సన్‌ వ్యాలీలో ఇటీవల బిలియనీర్ల సమ్మర్‌ క్యాంప్‌ జరిగింది.

ఓ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో వారెన్‌ బఫెట్‌ భార్య ఆస్ట్రిడ్‌ బఫెట్‌ కప్పు కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడంపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారట. ఇతర ప్రాంతాల్లోని కాఫీ ధరతో పోలిస్తే ఇది ఎక్కువేనంటూ అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్‌ బఫెట్‌ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement