మిస్‌ ఏఐ అందాల పోటీలో టాప్‌ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి! Zara Shatarvai Who Ranks In Top 10 Of Miss AI Beauty Pageant | Sakshi
Sakshi News home page

మిస్‌ ఏఐ అందాల పోటీలో టాప్‌ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి! ఎవరీమె..?

Published Wed, Jun 19 2024 2:15 PM | Last Updated on Wed, Jun 19 2024 3:06 PM

Zara Shatarvai Who Ranks In Top 10 Of Miss AI Beauty Pageant

ప్రపంచంలోనే తొలిసారి ఏఐతో రూపొందించిన మోడల్‌ల కోసం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ అందాల పోటీల్లో టాప్‌ టెన్‌ ఫైనలిస్ట్‌గా భారతదేశానికి చెందిన జరా శతావరి నిలిచారు. ఆమె పీసీఓఎస్‌ , డిప్రెషణ​ యోధురాలు. ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న వర్చ్యువల్‌ హ్యుమన్‌ అందాల పోటీల్లో పాల్గొన్న దాదాపు 1500 మంది అభ్యర్థులో భారతకి ప్రాతినిధ్యం వహిస్తున్న శతావరి ఎంపక కావడం విశేషం. అయితే ఈ పోటీల్లో అందం, సాంకేతికత, సోషల్‌ మీడియా ప్రభావం ఆధారంగా ఈ నెలాఖరులోగా విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతకీ ఎవరీమె అంటే..

ఎవరీ జరా శతావరి.?

  • ఉ‍త్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఏడువేల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. జరాకి భోజనం, ట్రావెలింగ్‌ అంటే మహా ఇష్టం. ప్రజలను ఆరోగ్యం, వృత్తి, అభివృద్ధి, ఫ్యాషన్‌ పరంగా మంచి జీవితాన్ని గడిపేలా శక్తిమంతం చేయడం ఆమె లక్ష్యం. 

  • ఇక ఆమె వర్చువల్ ప్రయాణంలో జూన్ 2023 నుంచి పీఎంహెచ్‌  బయోకేర్‌కి బ్రాండ్ అంబాసిడర్" ఉంది. అలాగే ఆగస్టు 2024లో డిజిమోజో ఈ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్‌గా చేరింది.

  • అంతేగాదు ఆమె 13 రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. వ్యూహాత్మక ప్లానింగ్‌లో, కంటెంట్‌ అభివృద్ధి, డేటా విశ్లేషణ, బ్రాండ్ అవగాహన, బ్రాండ్‌ అడ్వకేసీ, ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌, సృజనాత్మక ఆలోచన, ఆరోగ్యం అండ్‌ సంరక్షణ కౌన్సిలింగ్‌, ఫ్యాషన్‌ స్టైలింగ్‌ అండ్‌ కెరీర్‌ డెవలప్‌మెంట్‌ గైడెన్స్‌లలో మంచి నైపుణ్యం ఉంది ఆమెకు. 

  • తనని తాను డిజిటల్‌ మీడియా మావెన్‌గా అభివర్ణించే రాహుల్‌ చౌదరి మిస్‌ ఏఐ అందాల పోటీల్లో శతావరి టాప్‌ 10లో ఉందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు 1500 మంది పాల్గొనే ఈ పోటీల్లో ఆమెకు టాప్‌ 10లో చోటు దక్కడం విశేషం అని చెప్పారు. 

  • అంతేగాదు ఇన్‌ఫ్లుయెన్సర్‌ కమ్యూనిటీకి ఆమె చేసిన అత్యుత్తమ సహకారానికి నిదర్శనమే  ఫ్యాన్‌వ్యూ వరల్డ్‌ ఏఐ క్రియేటర్స్‌ అవార్డ్స్‌ ద్వారా వచ్చే ఈ గుర్తింపు అని రాహుల్‌ ప్రశంసించారు కూడా. ఈ ప్రపంచ వేదికపై ఆమె భారతదేశానికి, ఆసియాకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గొప్ప గౌరవం అని అన్నారు. అలాగే ఆసియా నుంచి పాల్గొన్ని ఇద్దరిలో శతావరి భారత నుంచి ఎంపికైన ఏకైక ఫైనలిస్ట్‌ కావడం విశేషం అన్నారు బ . 

  • కాగా, ఈ మిస్‌ ఏఐ తొలి మూడు విజేతల నగదు మొత్తం రూ. 16 లక్షలకు పైనే ఉంటుందట. అలాగే మిస్‌ ఏఐ క్రియేటర్‌ రూ. 4 లక్షల నగుదు బహుమితి అందుకోగా, ఏఐ మెంటర్‌ షిప్‌ ప్రోగ్రామ్‌లు, పీఆర్‌ సేవలకు మరిన్ని నగదు బహుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం.  

(చదవండి:

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement