Rave Party: రేవ్‌ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా? | Whats is Rave Party and Legal Landscape in India | Sakshi
Sakshi News home page

Rave Party: రేవ్‌ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?

Published Tue, May 21 2024 11:20 AM | Last Updated on Tue, May 21 2024 12:37 PM

Whats is Rave Party  and Legal Landscape in India

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది.  ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు  సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్నాయి.  సెలబ్రిటీలు సినిమా స్టార్స్‌స్‌పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్‌పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు,  నిషేధిత మత్తుమందులు  కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ  కథనాన్ని చదవాల్సిందే.


రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్‌  పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు పలువురితోపాటు,  ఇటీవల ప్రముఖ ఎల్విష్‌ యాదవ్‌పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్‌  స్టార్‌ హీరో  షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

 రేవ్‌ పార్టీ అంటే ఏంటి?  సెలబ్రిటీలకు  ఎందుకంత  క్రేజ్‌ 
విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో  రేవ్ పార్టీలు  పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్‌ నగరంలో కూడా విస్తరించింది.  ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు  విభిన్న రకాలుగా ఉంటాయి.  సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన  వ్యవహారం. ఇక్కడ గోప్యతకు  కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్‌మెంట్‌ కోసం ఇక్కడికి క్యూ కడతారు.  డ్యాన్స్, ఫన్, ఫుడ్‌, మద్యంతోపాటు, డ్రగ్స్‌కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్‌ పార్టీలు కాస్తా డ్రగ్స్‌ పార్టీలుగా మారిపోతున్నాయి. 

ఫుడ్‌, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్‌ఎస్‌డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్‌ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో  లైంగిక కార్యకలాపాల కోసం  ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.

రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్‌స్పాట్‌లుగా నిలిచాయి.

60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో  రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్‌లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక  ద్రవ్యాల నిరోధక(ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం  నిషేధం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement