రిజర్వాయర్‌ని వేలానికి పెట్టడం గురించి విన్నారా? UK Reservoir Sells For Nearly Rs 16 Lakh | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్‌ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?

Published Tue, Mar 12 2024 1:35 PM | Last Updated on Tue, Mar 12 2024 1:35 PM

UK Reservoir Sells For Nearly Rs 16 Lakh - Sakshi

రిజర్వాయర్‌లు అమ్మాకానికి వెళ్లడం ఏంటీ అని అనుకుంటున్నురా? ఔను ఇది నిజం అక్కడ స్థానిక ప్రజలకు ఆ రిజర్వాయర్‌ తలనొప్పిగా మారిందట. అందుకని దాన్ని వేలానికి వేయాలని నిర్ణయించారు దాని యజమాని. ఏంటా రిజర్వాయర్‌ ? ఎందువల్ల ఇలా అమ్మకానికి పెట్టారంటే..

యూకేలోని 200 ఏళ్ల నాటి రిజర్వాయర్‌ దాదాపు మూడు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ రిజర్వాయర్‌ పడమటి వైపు దాదాపు 900 మీటర్లు కలిగిన ఫుట్‌పాత్‌ ఉంది. ఇది అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ ట్రాఫిక్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో చెత్త సమస్య ఎక్కువయ్యింది. వీటన్నింటితో విసిగిపోయిన అక్కడ స్థానిక ప్రజలు రిజర్వాయర్‌ తమకు తలనొప్పిగా మారిందని స్తానిక నీత్‌ పోర్ట్‌ టాల్బోట్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.

చెప్పాలంటే ఈ రిజర్యాయర్‌ మంచి బ్యూటిఫుల్‌ స్పాట్‌ కావడంతో ఇక్కడకు టూరిస్ట్‌లు తాకిడి బాగా ఎక్కువ, పైగా ఈ ప్రాంతం సరదాగా గడిపేందుకు, వాకింగ్‌కి మంచి ప్రసిద్ధి. దీంతో ఈ ప్రదేశం అంతా అత్యంత రద్దీగా మారిపోయింది. దీన్ని తట్టుకోలేక స్థానిక ప్రజలు తమ గోడుని కౌన్సిల్‌ వద్ద మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా టూరిస్ట్‌లు ఆ రిజర్యావయర్‌ సమీపంలోనే స్టే చేయడం స్థానికులకు మరింత సమస్యాత్మకంగా మారింది

దీంతో ఈ రిజర్వాయర్‌ని గతేడాది నుంచి సమంత ప్రైస్‌ అనే వేలం సంస్థ వేలానికి ఉంచింది. గతేడాది దాదాపు రూ. 80 లక్షల వరకు పలకగా ఈ ఏడాది మాత్రం అత్యంత తక్కువ ధర రూ. 16 లక్షలు పలకడం గమనార్హం. దీనిపేరు బ్రోంబిల్‌ రిజర్వాయర్‌. ఇది స్థానిక ఉక్కు పరిశ్రమకు నీటిని సరఫరా చేయడం కోసం నిర్మించిన రిజర్వాయర్‌. ఇప్పటికీ ఇది పనిచేస్తుంది. సైక్లిస్టులకు, చేపలు పట్టేవాళ్లకు మంచి ప్రసిద్ధ ప్రదేశం. అయితే ఈ రిజర్వాయర్‌ని తొలగించడం అనేది అత్యంత రిస్క్‌తో కూడుకున్నది కూడా. ముఖ్యంగా చుట్టు పక్కల స్థానికులు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పర్యావరణానికి ఇబ్బందిక కలగకుండా నిర్ణిత ప్రమాణాలకు లోబడి చేయాల్సి ఉంటుంది. అంతేగాదు ఇలా రిజర్వాయర్‌లు వేలానికి వెళ్లడం అత్యంత అరుదు అని స్థానిక మీడియా పేర్కొంది.

(చదవండి: స్ట్రీట్‌ కేప్‌లో సర్వ్‌ చేస్తున్న రోబో వెయిటర్‌! నెటిజన్లు ఫిదా!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement