టైప్‌ 2 డయాబెటిస్‌ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! Scientists Discover New Cause For Diabetes | Sakshi
Sakshi News home page

టైప్‌ 2 డయాబెటిస్‌ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్‌పెట్టేలా..

Published Tue, Dec 12 2023 4:57 PM | Last Updated on Tue, Dec 12 2023 5:04 PM

Scientists Discover New Cause For Diabetes - Sakshi

అధిక సంఖ్యలో ప్రజలు టైప్‌ 2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లుకు ఓ నిర్ధిష్ట ఏజ్‌ వచ్చేటప్పటికీ మధుమేహం అనే దీర్ఘకాలిక వ్యాధి వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది వైద్యులకు కూడా తెలియలేదు. ఎందువల్ల ఇన్సులిన్‌ వ్యవస్థ పనిచేయడం అగిపోతుంది. తగిన స్థాయిలో ఎందుకు ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయలేకపోతుందనేది వైద్యులకు ఇప్పటికీ అర్థం కానీ ఓ మిస్టరీ. పైగా ఇది దీర్థకాలిక వ్యాధి, దీనికి నివారణ ఉండదు, కేవలం నియంత్రణ మాత్రమే. అలాంటి ఈ టైప్‌ 2 డయాబెటిస్‌ ఎందువల్ల వస్తుందో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. అంతేగాదు ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్కెపెట్టేందుకు మార్గం సుగమం చేసిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఇది ఎందువల్ల వస్తుందంటే..?

సాధారణంగా టైప్‌ 2 మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్‌కు ప్రతిస్పందించడం ఆపివేయడంతో ప్రారంభమై, చివరికి ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది శాస్త్రవేత్తలకు అర్థం కానీ చిక్కు ప్రశ్న. అందుకోసం మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషులపై అధ్యయనాలు కూడా నిర్వహించారు కేస్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇలా ఇన్నులిన్‌ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక ఎంజైమ్‌ని గుర్తించారు. దీన్ని స్కాన్‌(SCAN) అని పిలుస్తారు. ఈ ఎంజైమ్‌ ఇన్సులిన్‌ చర్యలకు గ్రాహకంగా పనిచేసే నైట్రిక్‌ ఆక్సైడ్‌ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది.

ఇక్కడ నైట్రిక్‌ ఆక్సైడ్‌ కీలకమైన రసాయనం. ఇది ఇన్సులిన్‌తో సహా హార్మోన్లను నియంత్రిస్తుంది. కాగా, శాస్త్రవేత్తలు మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషుల్లో ఈ స్కాన్‌(SCAN) కార్యచరణను గుర్తించారు. అలాగే ఈ ఎంజైమ్‌లేని ఎలుకల్లో మధుమేహం రాకుండా ఎలా సేఫ్‌గా ఉన్నాయో కనుగొన్నారు. ఈ ఎంజైమ్‌ ఒక్కటిని నిరోధిస్తే మధుమేహం నుంచి రోగులను రక్షించొచ్చని తెలిపారు. ఇక ఈ ఎంజైమ్‌ని నిరోధించడంపై పలు పరిశోధనలు చేయాల్సి ఉంది. అంతేగాదు ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ని జోడించి ఉండే ఎంజైమ్‌లు వివిధ రకాల వ్యాధులకు దారితీస్తాయని శాస్త్రవేత్త జోనాథన్‌ తెలిపారు. అధిక స్థాయి నైటిక్‌ ఆక్సైడ్‌ కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. అయితే ఇది రియాక్టివ్‌ మాలిక్యూల్‌ కావడం వల్ల నేరుగా దీన్నే లక్ష్యం చేసుకుని తొలగించడం కష్టమని చెప్పారు. 

(చదవండి: 220 టన్నుల హోటల్‌ని జస్ట్‌ 700 సబ్బులతో తరలించారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement