ఎవరీ మమతా దలాల్‌?..ఏకంగా షారూఖ్‌, సచిన్‌ కుమార్తెలకు.. Nita Ambanis Sister Mamta Dalal Who Is A Teacher By Profession | Sakshi
Sakshi News home page

ఎవరీ మమతా దలాల్‌?..ఏకంగా షారూఖ్‌, సచిన్‌ కుమార్తెలకు..

Published Tue, Jun 4 2024 12:31 PM | Last Updated on Tue, Jun 4 2024 1:07 PM

Nita Ambanis Sister Mamta Dalal Who Is A Teacher By Profession

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ కూడా. చాలా వరకు ముఖేశ్‌ అంబానీ వంశం గురించి అందరికీ తెలసు గానీ నీతా అంబానీ నేపథ్యం గురించి అంతగా తెలియదు. ముఖ్యంగా ఆమెకు ఒక తోబుట్టువు ఉన్నారనే విషయం చాలమందికి తెలియదు. ఆమె నీతా ఇంట్లో జరిగే ప్రతీ ఈవెంట్‌కి, ఫంక్షన్లకి హాజరవుతారు. కానీ మీడియాకు దూరంగానే ఉంటారు. ఆమె ఎవరంటే..

నీతా చిన్న చెల్లెలు మమతా దలాల్‌. ఆమె ఎక్కువ తన తల్లి పూర్ణిమ దలాల్‌తో కలిసి ఉంటారు. గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఈ సోదరిమణుల మధ్య వయో భేదం నాలుగేళ్ల అంతరం ఉంది. 2014లో తండ్రి రవీంద్రభాయ్‌ దాలాను కోల్పోయారు. మమతా దలాల్‌ సోదరి నీతా అంబానీ స్థాపించిన ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ప్రైమరీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంది. ముఖ్యంగా నటుడు షారూఖ్‌ ఖాన్‌ కుమార్తె, సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌తో సహా కొంతమంది ప్రముఖుల పిల్లలకు పాఠాలు బోధించారు. 

అంతేగాదు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లో కూడా భాగమే. అయితే ఆమె మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటారు. ఒక్కసారి మనీష్‌ మల్హోత్ర ఫ్యాషన్‌ ‌ షోలో మాత్రం మమతా దలాల్‌ మెరిశారు. అయితే మామాలు ష్యాషన్‌ షో కాదు. క్యాన్సర్‌ బాధితుల్లో కొత్త ఆశను రేకెత్తించేలా వారితో చేయించిన ష్యాషన్‌ షో. ఆమె ఇలాంటి ఎన్నో సేవాకార్యక్రమాలు, భోధనకు సంబంధించిన వర్క్‌షాప్‌ల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు.

ఇటీవల నీతా అంబానీ కొడుడు అనంత అంబానీ రెండో ఫ్రీ వెడ్డింగ్ క్రూయిజ్‌ వేడుకలో కూడా పాల్గొన్నారు. ఇక నీతా అంబానీనే ఒకానొక ఇంటర్వ్యూలో తన సోదరి మమతాతో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు. తాను, తన చెల్లెలు, తొమ్మిది మంది కజిన్‌ సోదరీమణులతో కలిసి ఉమ్మడి కుటుంబంలో పెరిగా. మహిళలకు విద్య, సమానత్వం, సాధికారత అత్యంల ముఖ్యమని ప్రగాడంగా నమ్మం, ఆ దిశగానే పెరిగాం అని చెప్పుకొచ్చారు. 

(చదవండి: ప్రధాని మోదీకి ఇష్టమైన సాత్విక ఆహారాలివే..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement