నీతా అంబానీ  లగ్జరీ కారు, ఫోటోలు వైరల్‌, ధర ఎంతంటే..! Nita Ambani Buys Rolls-Royce Phantom VIII EWB Goes Viral | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ  లగ్జరీ కారు, ఫోటోలు వైరల్‌, ధర ఎంతంటే..!

Published Wed, Apr 10 2024 10:35 AM | Last Updated on Wed, Apr 10 2024 10:44 AM

Nita Ambani luxury car Rolls Royce Phantom VIII EWB goes viral - Sakshi

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నీతా అంబానీ అంటే లగ్జరీకి పెట్టింది. డైమండ్‌ నగలు, వాచ్‌లు, ఖరీదైన చీరలు,విలాసవంతమైన బ్యాగులు, డనుంచి   చెప్పులు, లిప్‌స్టిక్‌  కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా    నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. స్పెషల్ గా కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్   లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు ఇది.

బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య నీతా కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి  కారు ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.దీని స్టాండర్డ్మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్‌కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా.  ముఖ్యంగా కారు హెడ్‌రెస్ట్‌లపై నీతాముఖేష్‌ అంబానీ (ఎన్‌ఎంఏ) కూడా ఎంబ్రాయిడరీ చేసిన పిక్స్‌కూడా ఇంటర్నెట్‌లో  చక్కర్లు కొడుతున్నాయి. 

 ఇప్పటికే అంబానీ కుటుంబంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్ సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి.  అయినా కొత్త కలర్‌  అధునాతన ఫీచర్లతో ఉన్న  కొత్త లగ్జరీ  రోల్స్‌ రాయిస్‌  ప్రత్యేకంగా నిలుస్తుంది. గత దీపావళికి, ముఖేష్ అంబానీ  భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.  భారతదేశంలో ప్రముఖ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్  కారు ఉన్నవారు ప్రముఖుల్లో  బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒకరు.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement