జ్వరం ఒక వ్యాధి కాదు! Fever is not a disease | Sakshi
Sakshi News home page

జ్వరం ఒక వ్యాధి కాదు!

Published Sat, Jun 1 2024 8:45 AM | Last Updated on Sat, Jun 1 2024 11:36 AM

Fever is not a disease

మనం జ్వరాన్ని ఓ వ్యాధిగా చూస్తాం. కాబట్టే జ్వరం రాగానే దాన్ని తగ్గించే మాత్రలు వేసుకోవాలని పోరపడుతూ ఉంటాం. నిజానికి జ్వరం అనేది వ్యాధి కాదు...అది వ్యాధిలో కనిపించే ఓ లక్షణం మాత్రమే! కాబట్టి అలా కనిపించే లక్షణానికి చికిత్స చేయటం మాని అందుకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దే చికిత్స తీసుకోవాలి. 

ఇందుకోసం తప్పనిసరిగా వైద్యుల్ని ఆశ్రయించాల్సిందే! జ్వరం తగ్గుతూ పెరుగుతున్నా, విడవకుండా రెండు రోజుల కు మించి వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని కలిసి పరీక్షలు చేయించుకుని జ్వరాన్ని కలిగించిన వ్యాధి గురించి తెలుసుకోవాలి. అలా కాకుండా  తాత్సారం చేస్తే జ్వర కారక వ్యాధి క్రిములు అంతర్గత అవయవాల మీద దాడిచేసి ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం కలిగించవచ్చు

రక్తశుద్ధికి...
👉టేబుల్‌ స్పూన్‌ నెయ్యి లో పది మిరియాలు వేసి చిన్న మంట మీద వేయించి తర్వాత వడపోసి, మిరియాలు తీసివేయాలి. వీటిని ఆహారంలో మొదటి ముద్దలో కలిపి తినాలి, 40 రోజులపాటు ఇలా చేస్తుంటే రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మవ్యాధులు అన్నీ హరించి వేస్తాయి పాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ లో, నీళ్లు తాగడం ఆపి కేవలం రాగి ΄ాత్రలో నీళ్లు మాత్రమే తాగండి ∙మీకు వచ్చే అన్ని రోగాలు, కొద్ది రోజులలో మటుమాయమవుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement