అనంత్‌-రాధిక : నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ధర ఎంతో తెలుసా? Anant Ambani-Radhika Pre-Wedding Stunns With Nita Ambani's Diamond Necklace | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక : నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ధర ఎంతో తెలుసా?

Published Mon, Mar 4 2024 10:49 AM | Last Updated on Mon, Mar 4 2024 12:20 PM

Anant Ambani Radhika prewedding stunns with Nita Ambani diamond Necklace - Sakshi

వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ  తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా  డ్యాన్సర్‌ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్‌ పెర్‌ఫామెన్స్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేయడం ఆమెకు అలవాటు.

తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్‌తో  అతిథులను  సర్‌ప్రైజ్‌ చేశారు.  ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన  డైమండ్ నెక్లెస్  స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా  నిలిచింది.

నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో  ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్‌పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్,  బ్లౌజ్‌ స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్‌,  చక్కటి  మేకప్‌తో తన ఐకానిక్‌ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. 

కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్‌ ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్‌లో ఆమె లుక్‌తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా  చెవిపోగులు, బ్యాంగిల్స్ ,   వేలి రింగ్‌ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర  దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. 

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్‌టెయిల్ నైట్‌ ఈవెంట్‌లో వైన్ కలర్‌ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్‌లో ఆమె లుక్‌ నీతా స్టయిలింగ్‌ను   ప్రతిబింబించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement