అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. Man Escape With Woman Gold Chain In Medchal | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో..

Published Wed, Mar 9 2022 4:45 PM | Last Updated on Wed, Mar 9 2022 6:27 PM

Man Escape With Woman Gold Chain In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌: అమ్మమ్మ పాలకూర కావాలంటూ పొలం చేను పని చేస్తున్న మహిళ వద్దకు వెళ్లిన వ్యక్తి పాలకూర కొన్నట్టు మాయ చేసి మహిళ మెడలోని 4తులాల పుస్తెలతాడుతో ఊడాయించిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బండమాదారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేకల శంకరమ్మ(52) ఉదయం తమ పొలంలో కూరగాయ పంట సాగు పని చేస్తుంది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఇండికా కారులో ఇద్దరు వ్యక్తులు పొలం వద్దకు వచ్చారు. అందులో ఒక వ్యక్తి కారు దిగి పోలంలో పని చేస్తున్న శంకరమ్మ వద్దకు వెళ్లి అమ్మమ్మ పాలకూర కావాలంటూ ఆకుకూర కొనే వ్యక్తిలా వెళ్లాడు.  

ఇప్పుడు వీలు కాదని శంకరమ్మ తెలుపగా ఇప్పుడు వండుకోవాలంటూ మాయమాటలు చెప్పడంతో శంకరమ్మ పాలకూర తెచ్చి ఇచ్చింది. రూ.10 శంకరమ్మకు చేతిలో పెట్టి మరో చేతితో ఆమె మెడలోని 4 తులాల పుస్తెలతాడును లాక్కుని పరిగెత్తాడు. దీంతో శంకరమ్మ కేకలు వేయగా అంతలోనే కారులో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సమీప గ్రామాల నాయకులకు సమాచారం అందజేసి ఇండికా కారు కనబడితే ఆపాలంటూ తెలిపారు. పుస్తెలతాడుతో పరారవుతున్న వ్యక్తుల కారు మండలంలోని రాయిలాపూర్‌ వద్ద రాయిలాపూర్‌ గ్రామస్తులు గమనించి దాని పట్టుకునే లోపు వారు కారు వెనక్కి తీసుకుని నూతన్‌కల్‌ గ్రామం వైపు వెళ్లింది.
చదవండి: హైదరాబాద్‌లో వర్క్‌ ఫ్రం ఆఫీస్‌; బ్యాక్‌ టు ‘ట్రాఫిక్‌ రూల్స్‌’

నూతన్‌కల్‌ గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేశ్‌రెడ్డికి రాయిలాపూర్‌ వాసులు సమాచారం ఇచ్చారు. నూతన్‌కల్‌ గ్రామంలో ఓ వాహనాన్ని సురేశ్‌రెడ్డి అడ్డుపెట్టగా దీనిని గమనించిన దుండగులు వారి కంటపడకుండా పరారయ్యారు. విషయం తెలుసుకున్న మేడ్చల్‌ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌.. రాష్ట్రంలో ముగ్గురే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement