World’s Biggest Apple iPhone Maker to Compete With Royal Enfield, Ola - Sakshi
Sakshi News home page

ఫాక్స్‌కాన్‌ రంగంలోకి: రాయిల్‌ ఎన్‌ఫీల్డ్‌, ఓలా ఏమైపోవాలి? 

Published Fri, Jun 16 2023 2:04 PM

World biggest Apple iPhone maker to compete with Royal Enfield Ola - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఈమేరకు  ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ-బైక్‌ మార్కెట్‌లో రానున్నకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను రిలీజ్‌ చేయాలని భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఐఫోన్ తయారీదారు తన వార్షిక నివేదికలో ఆగ్నేయాసియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్‌ను స్థాపించడానికి కంపెనీకి సహాయం చేస్తుందని పేర్కొంది. దీనిపై  ఫాక్స్‌కాన్ ఎగ్జిక్యూటివ్‌లతో  చర్చించడానికి భారతీయ ప్రతినిధి బృందం త్వరలో తైవాన్‌ను సందర్శించాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పలు బ్రాండ్‌ ఎలక్ట్రిక్  టూవీలర్స్‌ను తయారు చేస్తుందా లేదా జాయింట్ వెంచర్  ద్వారా ఒకే బ్రాండ్‌కు పరిమితమవుతుందా  అనేది  స్పష్టత లేదు. (టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ: బిగ్‌ డీల్‌ నుంచి ట్రాన్సామెరికా ఔట్‌!)

కాగా ఇప్పటికే  తమిళనాడులో పెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ మహారాష్ట్రలో కూడా  ఈవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది.   అటు తెలంగాణపై  కూడా దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. (అమెరికా గుడ్‌ న్యూస్‌: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!)

Advertisement
 
Advertisement
 
Advertisement