ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సపోర్ట్‌.. మార్గదర్శకాలను సరళీకరించిన సెబీ SEBI Imposed New Rules For Investors Services | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సపోర్ట్‌.. మార్గదర్శకాలను సరళీకరించిన సెబీ

Published Mon, Nov 8 2021 8:33 AM | Last Updated on Mon, Nov 8 2021 3:34 PM

SEBI Imposed New Rules For Investors Services - Sakshi

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సర్వీసుల అభ్యర్థనలను ప్రాసెస్‌ చేయడంలో నిబంధనలను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సరళీకరించింది. తద్వారా రిజిస్ట్రార్, షేరు బదిలీ ఏజెంట్‌(ఆర్‌టీఏ)గా వ్యవహరించే సంస్థల సులభ వ్యాపార నిర్వహణకు వీలు కల్పించింది. అంతేకాకుండా ఫిజికల్‌ సెక్యూరిటీస్‌ కలిగిన వాటాదారులు పాన్, కేవైసీ, నామినేషన్‌ వివరాలు అందించడంలోనూ మార్గదర్శకాలను జారీ చేసింది.

2022 జనవరి 1 నుంచి తాజా నిబంధనలు అమలుకానున్నాయి. 2023 ఏప్రిల్‌ 1 నుంచి సంబంధిత డాక్యుమెంట్లలో ఏ ఒక్కటి లేకున్నా ఆర్‌టీఏలు ఇన్వెస్టర్ల ఫోలి యోలను నిలిపివేసేందుకు వీలుంటుంది. డాక్యుమెంట్లు లభించాక మాత్రమే తిరిగి యాక్టివేట్‌ చేసేందుకు అధికారం లభిస్తుంది. ఇన్వెస్టర్లు 2022 మార్చి 31కల్లా పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement