ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..! Russia Putin Says Barrel 100 Dollars Quite Possible | Sakshi
Sakshi News home page

Vladimir Putin: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..!

Published Wed, Oct 13 2021 9:23 PM | Last Updated on Wed, Oct 13 2021 9:28 PM

Russia Putin Says Barrel 100 Dollars Quite Possible - Sakshi

ఇంధన ధరల పెరుగుదల పలు దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.  ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆయా దేశాల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్‌ లాంటి దేశాల్లో ఇంధన ధరలు సామాన్యుడి నడ్డిని విరుస్తున్నాయి. ఇప్పటికే భారత్‌లో పెట్రోల్‌ సెంచరీ దాటి పెరుగుతూనే ఉంది.  కరోనా రాకతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గిపోయింది. కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురుకు తీవ్రమైన డిమాండ్‌ ఏర్పడింది.  గత కొద్ది రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. 
చదవండి: చంద్రుడిపై రొమాన్స్‌.. రూ.158 కోట్లు నష్టం!

బ్యారెల్‌ ధరలు 100 డాలర్లకు..!
ఇంధన ధరల పెరుగుదలతో సతమతమౌతున్న ప్రపంచదేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పిడుగు లాంటి వ్యాఖ్యలను చేశాడు.అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 100 డాలర్లకు  కచ్చితంగా చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్యూటీఐ ప్రకారం బ్యారెల్‌ ముడిచమురు ధర 80 నుంచి 83 డాలర్ల వద్ద కొనసాగుతుంది.  రష్యా, ఒపెక్‌ దేశాలతో ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో నిలకడగా ఉంచేందుకు ప్రయత్నాలను చేస్తామని పుతిన్‌ అన్నారు. పెరుగుతున్న ముడిచమురు ధరలకు ప్రత్యామ్నాయంగా యూరప్‌ దేశాలకు నేచురల్‌గ్యాస్‌ను అందించడానికి రష్యా సిద్దంగా ఉందని పేర్కొనడం గమనార్హం.
చదవండి: గోల్డ్‌ లోన్‌ తీసుకునే వారికి గుడ్‌న్యూస్‌...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement