రిలయన్స్‌ షేర్ల రికార్డ్‌.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్‌ఐఎల్‌ RIL shares at record high market cap crosses Rs 18 lakh crore | Sakshi
Sakshi News home page

RIL share price: రిలయన్స్‌ షేర్ల రికార్డ్‌.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్‌ఐఎల్‌

Published Thu, Jan 11 2024 6:16 PM | Last Updated on Thu, Jan 11 2024 6:23 PM

RIL shares at record high market cap crosses Rs 18 lakh crore - Sakshi

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్‌ఐఎల్‌ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి.  బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. 

 ఫలితంగా ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్‌ఐఎల్‌ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్‌లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదిక పేర్కొంది.

డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్‌ఐఎల్‌ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్‌ఐఎల్‌ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. 

త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌
జామ్‌నగర్‌లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్‌ఐఎల్‌ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement