రిలయన్స్‌ చేతికే డిస్నీ?, డీల్‌ విలువ రూ.80,000 కోట్లు | Reliance Industries Near To Mega Deal To Buy Disney India Operations, Says Reports - Sakshi
Sakshi News home page

Reliance Industries-Disney India: రిలయన్స్‌ చేతికే డిస్నీ?, డీల్‌ విలువ రూ.80,000 కోట్లు

Published Tue, Oct 24 2023 11:39 AM | Last Updated on Tue, Oct 24 2023 2:12 PM

Reliance To Buy Disney India Operations - Sakshi

దేశీయ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌,అమెరికన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జెయింట్‌ వాల్ట్‌ డిస్నీల మధ్య నగదు బదిలి, స్టాక్‌ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది.  

భారత్‌లోని వాల్ట్‌ డిస్నీ తన డిస్నీ స్టార్‌ ఇండియా 10 బిలియన్‌ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 7 బిలియన్‌ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్‌ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్‌ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్‌లు హైలెట్‌ చేస్తున్నాయి.

 

డిస్నీ ఆస్తులన్నీ తన వద్దే  
ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్‌  మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్‌లు హైలెట్‌ చేస్తున్నాయి. చర్చల్లో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాను అలాగే ఉంచుకుని మిగిలిన మేజర్‌ వాటాను నగదు బదిలి, స్టాక్స్‌ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. డీల్పై తుది నిర్ణయం తీసుకోలేదు. డిస్నీ ఆస్తులను కొంత కాలం పాటు ఉంచుకోవాలని వాల్ట్‌ డిస్నీ అనుకుంటుందని సమాచారం.  

ఐపీఎల్‌ దెబ్బ.. ఆపై 
2022లో ఐపీఎల్‌ స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు అంబానీ సొంతం చేసుకున్నారు. జియో సినిమా ఫ్లాట్‌ఫారమ్‌లో ఐపీఎల్‌ ప్రసారాల్ని ఉచితంగా యూజర్లకు అందించారు. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీవో షోలను భారత్‌లో ప్రసారం చేసేందుకు గాను ఆ హక్కుల్ని రిలయన్స్‌ సొంతం చేసుకోవడం వంటి వరుస పరిణామాలతో వాల్ట్‌డిస్నీ స్టార్‌ డిస్నీని అమ్మేలా నిశ్చయించుకుంది. 

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. 
భారత్‌ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 43 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయని డిస్నీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 35 మిలియన్ల వ్యూస్‌ వచ్చినట్లు బ్లూమ్‌ బెర్గ్‌ నివేదించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement