AI In Medical: Google Testing Medical AI Chatbot Med-PaLM 2 In Hospitals - Sakshi
Sakshi News home page

Medical AI Med PaLM 2: గూగుల్‌ మరో ‘AI’ టూల్‌ ఫెయిల్‌.. ఈ సారి ఏమవుతుందో

Published Mon, Jul 10 2023 11:49 AM | Last Updated on Mon, Jul 10 2023 12:28 PM

Google Testing Medical Ai Chatbot Med-palm 2 In Hospitals - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తయారు చేసిన ఏఐ చాట్‌బాట్‌ మెడ్‌ - పీఏఎల్‌ఎం2 పనితీరును మయో క్లీనిక్‌తో పాటు పలు ఆస్పత్రులలో పరీక్షించనుంది. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రకారం.. చాట్‌బాట్‌ మెడ్‌- పీఏఎంల్‌ఎం2పై గూగుల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి టెస్టింగ్‌ నిర్వహిస్తుంది.

ఇక, ఈ టూల్‌ ముఖ్య ఉద్దేశం డాక్టర్లకు అంతు చిక్కని మెడికల్‌ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ చాట్‌బాట్‌ ఉపయోగపడుతుంది. గూగుల్‌  ఏటా సాఫ్ట్​వేర్ అప్డేట్​లు, కంపెనీ ఉత్పత్తులను Google I/O 2023 ద్వారా ప్రకటిస్తూ ఉంటుంది. Google I/O అనేది అమెరికాలోని కాలిఫోర్నియా.. మౌంటెన్​వ్యూలో నిర్వహించే వార్షిక డెవలపర్ సమావేశం. 

మేలో నిర్వహించిన గూగుల్‌ I/Oలో పీఏఎల్‌ఎం2 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ తెస్తామని ప్రకటించింది. అప్‌డేట్‌ కోసం గూగుల్‌ హెల్త్‌ కేర్‌ నిపుణుల్ని నియమించింది. వాళ్లే పీఏఎల్‌ఎం2 డాక్టర్లకు అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన సలహాలు ఎలా ఇవ్వాలనే అంశంపై శిక్షణ సైతం ఇచ్చారు. 

ఫెయిల్‌.. మరోసారి టెస్టింగ్‌
గూగుల్‌ హెల్త్‌కేర్‌ చాట్‌బాట్‌ వైద్య సేవల వనరులు పరిమితంగా ఉన్న దేశాల్లో దీని అవసరం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ, చాట్‌బాట్‌తో కొన్ని ఖచ్చితత్వ సమస్యలు ఉన్నాయని హెల్త్‌కేర్‌ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపాల్ని గూగుల్‌ ముందే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇతర వైద్యులు అందించిన వాటితో పోలిస్తే గూగుల్‌ చాట్‌బాట్‌ మెడ్‌ పీఏఎల్‌ఎం2 అందించిన సమాధానాలలో పొంతనలేని, అసంబద్ధమైన సమాచారం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

చదవండి👉 సుందర్‌ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement