టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్ | Elon Musk Says Thanks To Indian Origin Engineer Ashok Elluswamy Person Behind Teslas Autopilot Innovations | Sakshi
Sakshi News home page

టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్

Published Sun, Jun 9 2024 5:47 PM | Last Updated on Sun, Jun 9 2024 6:59 PM

Elon Musk Says Thanks To Indian Origin Ashok Elluswamy

గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.

టెక్ బిలియనీర్ అశోక్‌ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్‌ను ముందుకు నడిపించారు.

అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్‌కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్‌ను తీసుకువచ్చాము.

ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్‌వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్‌వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్‌ను తయారు చేసాము.

మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్‌ను గొప్పగా ప్రశంసించారు.

థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్‌లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement