భారత్‌లో టెస్లా పెట్టుబడులు.. మస్క్‌ యూటర్న్‌ Elon Musk congratulates PM Modi on his election win and expresses his excitement to work on projects in India. Sakshi
Sakshi News home page

మోదీకి శుభాకాంక్షలు.. త్వరలో భారత్‌కు ఎలోన్‌ మస్క్‌

Published Sat, Jun 8 2024 3:31 PM | Last Updated on Sat, Jun 8 2024 3:44 PM

Elon Musk Congratulates Pm Modi

టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ యూటర్న్‌ తీసుకున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మస్క్‌ ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి మస్క్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. మా సంస్థ త్వరలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్‌ చేశారు.

భారత్‌కు ఆహ్వానం
ఆ ట్వీట్‌కు మోదీ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయ యువత, జనాభా, ఊహాజనిత విధానాలు, స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్‌ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు.  

మస్క్‌ యూటర్న్‌.. అంతలోనే 
భారత్‌లో టెస్లా పెట్టుబడులు నిమిత్తం ఆ సంస్థ సీఈవో ఎలోన్‌ మస్క్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 21,22 తేదీలలో ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత టెస్లాకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్‌ ట్వీట్‌ చేయడం..అనూహ్యంగా చైనాలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మస్క్‌ భారత్‌లో పెట్టుబడుల అంశం వెనక్కి తగ్గింది. తాజాగా, మరోమారు పెట్టుబడులు పెట్టడంపై మస్క్‌ ట్వీట్‌ చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement