రిలయన్స్‌ వ్యాక్సిన్‌: ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌! Covid 19 Vaccine Reliance Life Sciences Seeks Nod To Human Trials | Sakshi
Sakshi News home page

Reliance Vaccine: ఫస్ట్‌ ఫేజ్‌ ట్రయల్స్‌కు అనుమతి.. వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి!

Published Fri, Aug 27 2021 11:35 AM | Last Updated on Fri, Aug 27 2021 11:38 AM

Covid 19 Vaccine Reliance Life Sciences Seeks Nod To Human Trials - Sakshi

ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌.. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ తయారీలోకి అడుగుపెట్టింది.  రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ వృద్ధి చేసిన రీకాంబినెంట్‌ ఆధారిత వ్యాక్సిన్‌.. రెగ్యులేటరీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్‌ను పరిశీలించిన ది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  దీంతో హ్యూమన్‌ ట్రయల్స్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.
 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్ పరిధిలోని రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ డెవలప్‌ చేసిన ఈ వ్యాక్సిన్‌.. ఇప్పుడు లైన్‌ క్లియన్‌ కావడంతో త్వరగా ఫేజ్‌-1 ట్రయల్స్‌ను మొదలుపెట్టనుంది. మొత్తం 58 రోజులపాటు ఫస్ట్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ ముంబై ధీరూబాయ్‌ అంబానీ లైఫ్‌ సైన్సెస్‌ సెంటర్‌లో నిర్వహించనుంది. అది అయిపోయిన వెంటనే.. రెండో, మూడో ట్రయల్స్‌ నిర్వహిస్తుంది. రెండో డోసుల ఈ వ్యాక్సిన్‌ అన్ని సక్రమంగా జరిగితే.. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. 
 
దేశంలో వ్యాక్సినేషన్‌ రేటు పుంజుకునే టైంలో.. రిలయన్స్‌ వ్యాక్సిన్‌ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ప్రజలను ఆకర్షించేందుకు రిలయన్స్‌ ఎలాంటి అడుగులు వేయనుందో అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా, క్యాడిల్లా వ్యాక్సిన్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

చదవండి: అంబానీ ‘డబుల్‌’ మాస్టర్‌ ప్లాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement